షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సీరియస్..!

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై సీఎం జగన్ ( CM Jagan )మేనత్త విమలమ్మ( Vimalamma ) తీవ్రంగా మండిపడ్డారు.

వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారని ధ్వజమెత్తారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్లిద్దరూ చూశారా అని ప్రశ్నించారు.

షర్మిల, సునీతా రెడ్డి ( Sharmila , Sunita )వ్యక్తిగతంగా జగన్ పై కక్ష పెట్టుకున్నారని విమలమ్మ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికైనా షర్మిల, సునీత నోరు మూసుకోవాలని సూచించారు.జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారని తెలిపారు.

ఇకనైనా షర్మిల, సునీత అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆమె సూచించారు.

బైక్‌పైనుంచి దిగగానే మహిళపై దూసుకొచ్చిన ఆవు.. ఆ తర్వాతే ఏమైందంటే..?