తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్..!!
TeluguStop.com
దసరా పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ నేతలు ఎవరికి వారు భక్తి భావనలో మునిగిపోతున్నారు.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ( CM Kcr )కుటుంబ సమేతంగా పూజలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) సోషల్ మీడియాలో తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
"""/" /
"చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి( Vijayadashami ).
అదే స్ఫూర్తితో మీరు కూడా విజయాలు సాధించాలని.ఆ దుర్గాదేవి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు" అని అన్నారు.వచ్చే ఎన్నికలను వైయస్ జగన్( YS Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
175 కి 175 నియోజకవర్గాలు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది.ఇదే సమయంలో ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో నేతల పనితీరుపై సర్వేలు చేస్తూ వాటి ఫలితాల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.
దీంతో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ( YCP )నాయకుల నిత్యం ప్రజలలో ఉంటూ ఉన్నారు.
ఇదే సమయంలో పార్టీ తరఫున బస్సు యాత్రతో పాటు మూడు ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించడానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కస్తూరి శంకర్… కాంప్రమైజ్ అవ్వలేదు అంటూ?