రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( CM Jagan ) రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు( Ramzan ) తెలియజేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ.

సామరస్యానికి, సహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ద్రాతృత్వానికి ప్రతీక అని అన్నారు.

ముస్లిం సోదరుల ప్రార్థనలు సఫలం కావాలని, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

"""/" / శనివారం దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు.

దాదాపు 30 రోజులపాటు కటిక ఉపవాసాలతో భక్తిశ్రద్ధలతో.రంజాన్ మాసాని ఆచరించడం జరిగింది.

ఈ క్రమంలో రేపు రంజాన్ పండుగను.బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలసి ముస్లిం సోదరులు చాలా ఘనంగా నిర్వహించుకోనున్నారు.

ఈ సందర్భంగా చాలా మంది రాజకీయ నేతలు ముందుగానే సోషల్ మీడియాలో రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

పిల్లి గీరడంతో మృతి చెందిన రష్యన్ వ్యక్తి.. షాక్‌లో ఫ్యామిలీ!