CM Jagan : రేపు ఒంగోలులో పర్యటించనున్న సీఎం జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.

ఒంగోలులో( Ongole ) 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

రేపు ఉదయం 9:40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 10:20గంటలకు ఒంగోలు చేరుకుంటారు.

నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే రూ.350 కోట్ల ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం 12.25 గంటలకు బహిరంగ సభలో ప్రసంగం చేస్తారు.

దీంతోపాటు నవరత్నాలు( Navaratnalu ) పేదలందరికీ ఇల్లు క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.

19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్క చెల్లెమ్మల పేరు మీదగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వెయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ రేపు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

"""/" / అనంతరం తాడేపల్లి తిరిగి వెళ్తారు.మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలలలో ఎన్నికలు ( AP Elections ) జరగనున్నాయి.

ఎన్నికలను సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.వచ్చే ఎన్నికల విషయంలో ఎలాగైనా అధికారం సుస్థిరం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.

దీంతోనే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ప్రచారం విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం "సిద్ధం" సభలతో( Siddham Meeting ) ప్రచారం షురూ చేసిన జగన్ పాలన విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.

ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?