CM Jagan : కుప్పం పై కన్నేసిన జగన్ .. 26 న ఏం చేయబోతున్నారంటే ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాగా చెబుతున్నారు.

వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

సభలు , సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు,  పార్టీ నాయకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవైపు ఈ సభలు , సమావేశాలతో పాటు ,ఎన్నికల వ్యూహాలపై  పూర్తిగా ఫోకస్ చేశారు.

ముఖ్యంగా టిడిపి , జనసేన కీలక నాయకులు పోటీ చేయబోయే నియోజకవర్గాలే లక్ష్యం గా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం( Kuppam Assembly Constituency ) పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు.

అక్కడ చంద్రబాబును ఓడించగలిగితే రాజకీయంగా తమకు మరింతగా గ్రాఫ్ పెరుగుతుందని భావిస్తున్నారు .

"""/" /  నియోజకవర్గంలో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy )కి అక్కడ బాధ్యతలను అప్పగించారు.

ఎంఎల్సీ భరత్ ను  అభ్యర్థిగా ప్రకటించారు.ఈ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఏ విషయంలోనూ ప్రజలను సానుకూలత లభించకుండా పక్క ప్లాన్ ను జగన్ సిద్ధం చేశారు .

దీనిలో భాగంగానే ఈనెల 26వ తేదీన జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు .

అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి జగన్ అందించనున్నారు.కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చిన ఘనత వైసిపిదేనని చెప్పబోతున్నారు.

కుప్పంలో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు .ఇక తర్వాత ఈ నియోజకవర్గంలోని కీలక నాయకులతో జగన్ సమావేశం కానున్నారు.

అనంతరం గుండి శెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. """/" / ఆ తర్వాత స్థానిక నాయకులతో సమావేశం అవుతారు.

వైసీపీ గెలుపు కుప్పం తోనే ప్రారంభం కావాలని ఇప్పటికే జగన్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గం పైన , అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న భీమవరం నియోజకవర్గం పైన జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి ఓటమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించిన విజయశాంతి దంపతులు.. అసలేం జరిగిందంటే!