కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు ఇంఛార్జులను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మార్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఈ మేరకు కాసేపట్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ కానున్నారు.

ఇందులో ప్రధానంగా పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులతో పాటు టికెట్ లేని వారి అసంతృప్తి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా…వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!