మామ వర్ధంతి సభలో పుస్తకావిష్కరణ చేసిన సీఎం జగన్..!!

కడప జిల్లా పులివెందులలో ఉన్న భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి ప్రధమ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ క్రమంలో జగన్ తన మామ ఈసీ గంగిరెడ్డి సమాధి వద్ద.నివాళులు అర్పించారు.

అనంతరం ఆడిటోరియంలో జరిగిన సభలో కుటుంబసభ్యులంతా పాల్గొని.  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఈ సభలో సీఎం జగన్ సంస్మరణ సభ అనంతరం "మరపురాని జ్ఞాపకం డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి" అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

వైయస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, టిటిడి ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ వైయస్‌.

అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పేదలను ఆదుకోవడంలో.

ఉచితంగా వైద్యం అందించడంలో.ఈసీ గంగిరెడ్డి సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.

పేదలకు.అనేక రకాలుగా ఉచిత వైద్యం.

ఈసీ గంగిరెడ్డి అందించే వారని.చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో ప్రతి మంగళవారం ఉచితంగా చికిత్స.అందించే కార్యక్రమం నిర్వహించేవారని.

ఎంతోమందినీ ఈసీ గంగిరెడ్డి.ఆదుకోవటం జరిగిందని ఈ సంస్మరణ సభలో ఆయన చేసిన సేవలు, వ్యక్తిత్వం గురించి కొనియాడారు.