సీఎం జగన్ 21వ రోజు బస్సు యాత్ర షెడ్యూల్..!!
TeluguStop.com
వైసీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇడుపులపాయలో మొదలైన యాత్ర విశాఖపట్నం( Yatra Visakhapatnam ) వరకు సాగింది.ఈ క్రమంలో సోమవారం విశ్రాంతి తీసుకోవడం జరిగింది.
మొత్తం 20 రోజులపాటు సాగిన ఈ యాత్ర మంగళవారం 21వ రోజు యాత్ర ప్రారంభం కాబోతోంది.
ఈ సందర్భంగా.21వ రోజు జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
మంగళవారం ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవివి సిటీ రాత్రి బస్సు నుంచి బయలుదేరి మధురవాడ మీదుగా అనంతపురం చేరుకొని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
"""/" /
అటు తర్వాత తగారపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు.జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అటు తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
ఇంకా రెండు రోజులు మాత్రమే బస్సు యాత్ర సాగనుంది.దీంతో దిగ్విజయంగా పటిష్టమైన భద్రత మధ్య.
యాత్ర సాగేలా వైసీపీ( YCP ) నేతలు సిద్ధం కావడం జరిగింది.2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో "మేమంతా సిద్ధం" బస్సు యాత్రకి భారీ ఎత్తున జన స్పందన రావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
మరోసారి ఆస్కార్ లిస్ట్‌లో రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఏ కేటగిరీలో చేరిందో మీకు తెలుసా?