సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!

సీఎం జగన్( CM Jagan ) రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ( Thalashila Raghuram )విడుదల చేశారు.

సోమవారం మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు రేపల్లె, మధ్యాహ్నం 12.

30కు మాచర్ల, మ.3 గంటలకు మచిలీపట్నం బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇదే సమయంలో అధికారం చేజారి పోకుండా వైసీపీ అధినేత వైయస్ జగన్ కూడా చాలా తెలివిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.

"""/" / ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎమ్మెల్యేలను.మంత్రులను నిత్యం ప్రజలలో ఉంచి జరిగిన మంచిని వివరించారు.

అనంతరం సిద్ధం, బస్సు యాత్రలతో వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం జరిగింది.ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో రోజుకి కనీసం మూడు నియోజకవర్గాలలో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది.ఇదే సమయంలో మంచి జరిగితేనే ఓటేయండి అంటూ.

సంచలన ప్రసంగాలు చేస్తున్నారు.శనివారం వరకు వరుస పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ ఆదివారం విరామం తీసుకోవడం జరిగింది.

కాగా రేపు సోమవారం రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

స్పీకర్ కి జగన్ రాసిన లెటర్ పై స్పందించిన బుద్ధా వెంకన్న..!!