ఈ నెల 23 తిరుపతి, శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పర్యటన..!!

ఈ నెల 23 వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ చూస్తే 23వ తారీకు ఉదయం గన్నవరం నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం రేణిగుంట నుండి హెలికాప్టర్ ద్వారా తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద నిర్మితమైన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ తర్వాత పేరూరు నుండి హెలికాప్టర్ లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామానికి చేరుకుంటారు.

ఇనగలూరు వద్ద 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన అపాచీ పాదరక్షల తయారీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశం అవుతారు.అనంతరం అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ నుండి మళ్లీ రోడ్డు మార్గం ద్వారా  విమానాశ్రయం పక్కన శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 నీ సందర్శిస్తారు.

ఇక అదే ప్రాంగణంలో టిసిఎల్ కంపెనీకి సంబంధించిన అనుబంధ యూనిట్ల ప్రారంభోత్సవం మరియు భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమాల అనంతరం తిరుపతి విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు గన్నవరం విమానాశ్రయం కు అక్కడ నుండి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు భద్రతా ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు.

3 గంటల్లోనే రూ.4 లక్షలు సంపాదించిన యువతి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..