రాజ్ భవన్ కు సీఎం జగన్..!!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నయా ట్రెండ్ సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే టీడీపీ కూటమి విజయపథంలో దూసుకెళ్తుంది.

మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టీడీపీ గెలుపు దాదాపు ఖరారు అయినట్లే.ఈ నేపథ్యంలో సీఎం జగన్( CM Jagan ) రాజ్ భవన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు.కాగా టీడీపీ విజయం లాంఛనం కాగా.

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.ఈ క్రమంలోనే ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ( Chandrababu )ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

అయితే ప్రస్తుతం సుమారు 134 స్థానాల్లో టీడీపీ ( TDP )లీడ్ లో ఉండగా.

జనసేన 20 స్థానాలు, బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.టీడీపీ కూటమి గెలుపు ఖాయమైన నేపథ్యంలో.

పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.