ఏపీ గవర్నర్ తో భేటీకానున్న సీఎం జగన్
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీకానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని ఆరోపిస్తూ టీడీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే ఎంపీలకు సైతం భద్రత లేదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ బృందం ఫిర్యాదు అందజేసింది.
టీడీపీ ఫిర్యాదు తరువాత ఇవాళ సీఎం జగన్ గవర్నర్ తో సమావేశం కానున్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
అల్లు అర్జున్ కేసు నుంచి బయట పడతాడా..?