ఈ నెల 16న కర్నూల్ కి సీఎం జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16 వ తారీఖున కర్నూలుకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.

కోటేశ్వర రావు స్పష్టం చేశారు.పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరు అవుతారని స్పష్టం చేశారు.

ఈ పెళ్లి వేడుక 17వ తేదీ కాగా 16వ తారీఖున సీఎం కర్నూలు చేరుకొని.

కృష్ణా నగర్ లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో వధూవరులను ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు.

సీఎం పర్యటనకు సంబంధించి మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు మరియు పోలీసులతో సమావేశం.

జిల్లా కలెక్టర్ నిర్వహించడం జరిగింది.సీఎం పర్యటన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సమావేశంలో తెలిపారు.

ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా బెటాలియన్ చేరుకుంటారని తెలిపారు.

ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా కృష్ణా నగర్ లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని.భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేయాలని.

పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని.

సీఎం పర్యటనలో ఎవరైనా అలసత్వం వహిస్తే వేటు తప్పదని అధికారులను జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.