వైయస్ వర్ధంతి సందర్భంగా రేపు కడపకు సీఎం జగన్..!!

రేపు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) 14వ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వైయస్ అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు వైయస్ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ఎప్పటి మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ సమాధి( YSR ) వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

శనివారం కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ క్రమంలో వైయస్ సమాధి వద్ద నివాళులర్పించేందుకు వైయస్సార్ ఘాట్ కి జగన్( CM Jagan ) తో పాటు కడప జిల్లాకు చెందిన నాయకులు కూడా రాబోతున్నారు.

వైయస్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించి శనివారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:20 గంటలకు సీఎం జగన్ ( CM Jagan )కడప విమానాశ్రయానికి చేరుకొనున్నారు.

ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10:55కు ఇడుపులపాయలో వైయస్సార్ ఎస్టేట్ కి చేరుకుంటారు.

11:05 గంటల నుంచి 11:25 గంటల వరకు వైయస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

ఆ తర్వాత 11:35 గంటల నుంచి 12:05 గంటల వరకు స్థానిక నేతలు.

కార్యకర్తలతో జగన్ మాట్లాడనున్నారు.ఆ తర్వాత 12 35 గంటలకు హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణమై కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా 1:50 గంటలకు ఘన విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ నుంచి 2:20 గంటలకు సీఎం తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?