‘అన్ స్టాపబుల్’కు త్వరలో సీఎం జగన్..?
TeluguStop.com
తెలుగునాట.బాగా రక్తికెక్కిన షో.
అన్ స్టాపబుల్.ఆహా స్ట్రీమింగ్ నడుస్తున్నలో ఈ షోకు హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు.
మొదటి సీజన్ లో ప్రజల్లోకి వెళ్లిన ఈ షో.సెకెండ్ సీజెన్ లో దూసుకుపోతోంది.
అటు సినిమా ఇండస్ట్రీతో పాటు.రాజకీయ నాయకులను బాలయ్య షోకు ఆహ్వానిస్తూ.
తనదైన శైలితో సమాధానాలు రాబడుతున్నారు.అయితే మొదటి సీజన్ ఒకెత్తు అయితే.
రెండో సీజన్ అంతకు మించి నడుస్తోంది.బాలయ్య సెకెండ్ సీజన్ కు మాజీ ముఖ్యమంత్రి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.ఆయన ఈ ఒక్క షోతో తనపై ఉన్న చాలా మరకల్ని తొలగించుకున్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు అనే విమర్శలకు దాదాపు చెక్ పెట్టేశారు.ఇక ఆక్కడితో.
షో ఇంకో రేంజ్ కు వెళ్లింది.తర్వాత వచ్చిన స్టార్లు కూడా తమ ఆహార్యంతో.
ప్రేక్షకులను కట్టిపారేశారు.రాణా, శర్వానంద్, ప్రభాస్ లాంటి హీరోలు రావడంతో.
షో దూసుకు పోయింది.ఇక ఇప్పుడు ఏకంగా.
భారీ స్టార్ డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను బాలయ్య తన షోకు తీసుకుని వచ్చారు.
నిజానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు ఎలాంటి గెస్ట్ షోలకు వెళ్లరు.బాలయ్య మీద ఉన్న అభిమానంతో.
కాదనలేక షోకు వెళ్లారు.అయితే అవి వారికి మంచి వినోదాన్ని కల్గించాయి.
"""/"/
ఇక పవన్ ఎంట్రీ తర్వాత.ఆయన సినమా కంటే.
అందరికీ ఆహాలో వచ్చే.పవన్ షో పైనే ఆసక్తి పెరిగింది.
ఇదే ఒకెత్తు అయితే.ఇప్పుడు అన్ స్టాపబుల్ షో పైన మరో పుకారు షికారు చేస్తోంది.
అదేంటంటే.త్వరలో సీఎం జగన్ బాలయ్య షోకు రానున్నారని.
నిజానికి నందమూరి బాలకృష్ణ అంటే సీఎం జగన్ కు ఎంతో ఇష్టం.అప్పట్లో కడప జిల్లా బాలయ్య అసోసియేషన్ కు జనగ్ అధ్యక్షుడుగా కూడా చేశారు.
బాలయ్య సినిమాలు అంటే.ఆయన ఎక్కడున్నా.
షోలు వేయించుకుని మరీ చూస్తారట. """/"/
దానికి తోడు.
బాలయ్య, జగన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది.ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, జనసేనల అధినేతలను షోకు రప్పించిన బాలయ్య ఇక జగన్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది.
బాలయ్య మాటను కాదనలేక సీఎం జగన్ అన్ స్టాపబుల్ లో ఎంటర్ అయితే.
ఇక అన్ని షోలు మూసేసుకోవాల్సిందే.అంటున్నారు విశ్లేషకులు.
చూడాలి మరి నెటిజన్ల పుకారును నిజం చేస్తూ.బాలయ్య కనుక సీఎం జగన్ ను తీసుకు రా గలిగితే.
షో.నిజంగా అన్ స్టాపబులే అవుతుంది.
కజకిస్థాన్ విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగిందంటే? వీడియో వైరల్