మచిలీపట్నం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

మచిలీపట్నం( Machilipatnam ) "మేమంతా సిద్ధం" సభలో సీఎం జగన్( CM Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.ఈ పరిస్థితులలో ఎన్నికలు బాగా జరుగుతాయని నమ్మకం కూడా రోజురోజుకి సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు.

ఇష్టానుసారంగా అధికారులను కూడా మార్చేస్తున్నారు.మహిళలకు జరగాల్సిన మంచి పనులను కూడా ఆపేస్తున్నారు.

కారణం పేదలకు మంచి చేస్తున్న జగన్ నీ లేకుండా చేయాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై( Land Titling Act ) కూడా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఈ యాక్ట్ ఉద్దేశం.ఎవరి భూములపై వారికి హక్కులు కల్పించడం అని స్పష్టం చేశారు.

"""/" / భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసికోచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ యాక్ట్ గొప్పదని టీడీపీ నేత పయ్యవులే( Payyavula Keshav ) అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు.

మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు పన్నుతున్నారని జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తన మనిషి నిమ్మగడ్డతో పెన్షన్ పంపిణీ జరగకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని విమర్శించారు.

చంద్రబాబు( Chandrababu ) కుట్రల వల్లే పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో మచిలీపట్నం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’