ఐదేళ్ల క్రితం ఇదే రోజు అంటూ సీఎం జగన్ సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ ఫలితాలు( AP Results ) జూన్ 4న వెలువడనున్నాయి.ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ నాయకులు మెల్లమెల్లగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు.

బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) అమెరికా నుండి తిరిగి రావడం జరిగింది.

ఎల్లుండి రాత్రి లండన్ నుంచి రాష్ట్రానికి సీఎం జగన్( CM Jagan ) రానున్నారు.

ఈ క్రమంలో గెలుపు విషయంలో వైసీపీ.టీడీపీ కూటమి నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

ఇదిలా ఉంటే సీఎం జగన్ గురువారం సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

"""/" / "దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది.

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది".

అంటూ పోస్ట్ చేయడం జరిగింది.ఇదే సమయంలో గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో దిగిన ఫోటో పోస్ట్ చేయడం జరిగింది.

"""/" / గత సార్వత్రిక ఎన్నికలలో 151 స్థానాలతో.వైసీపీ( YCP ) అధికారంలోకి రావడం తెలిసిందే.

ఎన్నికలలో గెలిచిన తర్వాత మే 30వ తారీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

దీంతో నేటిగా 5 సంవత్సరాలు కావటంతో.ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ సీఎం జగన్ పోస్ట్ చేయడం జరిగింది.

కాగా 2019 మాదిరిగానే ఈసారి ఎన్నికలు కూడా ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ అధినేత జగన్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

లండన్ వెళ్లకముందు విజయవాడలో ఐప్యాక్ కార్యాలయంలో మాట్లాడిన జగన్ గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెప్పుకొచ్చారు.

రోజూ నైట్ ఈ వాటర్ తాగితే పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరిగిపోతుంది!