CM Jagan : వివేకా మరణంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.

నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టడం జరిగింది.మార్చి 27 మధ్యాహ్నం ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ప్రారంభించడం జరిగింది.

మొత్తం 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరగబోతున్న ఈ యాత్రలో మొట్టమొదటి మీటింగ్ ప్రొద్దుటూరులో( Proddatur ) నిర్వహించారు.

ఈ సభలో సీఎం జగన్ సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.తన ఐదేళ్ల పాలనపై అదేవిధంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ క్రమంలో మాజీమంత్రి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / "మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు.

కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో.? వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది.

చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు.వాడిని చంద్రబాబు,( Chandrababu ) అతడు ఎల్లో మీడియాను నెత్తిన పెట్టుకుంటున్నాయి అని ఆరోపించారు.

చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి.

? ఈ రకంగా రాజకీయంగా దెబ్బతీయటానికి చూస్తున్నారు. """/" / నేను మాత్రం ఆ భగవంతున్ని ప్రజలను మాత్రమే నమ్ముకున్న.

అదేవిధంగా ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న.మన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారికి ప్రజలకు మంచి చేసిన దాఖలాలు లేవు.

వాళ్లంతా ప్రజలను వంచిస్తూ ఉంటారు.వాళ్లందరికీ మేనిఫెస్టో అంటే ఎన్నికల అప్పుడు ప్రకటించడం తర్వాత చెత్తబుట్టలో పడేయటం లాంటిది.

మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాలు కూడా నెరవేర్చిన చరిత్ర వాళ్లకి లేదు.

కానీ మేనిఫెస్టో పవిత్రంగా భావించి 99 శాతం వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందని సీఎం జగన్ స్పీచ్ ఇచ్చారు.

ఆరోగ్యానికి వరం చుక్కకూర.. వారానికి ఒక్కసారి తిన్న లాభాలే లాభాలు!