భీమవరంలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) బస్సు యాత్ర భీమవరంకు( Bhimavaram ) చేరుకుంది.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) జగన్ సెటైర్లు వేశారు.

పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి.పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టు భార్యలను వదిలేస్తాడు.

ఇప్పుడు నియోజకవర్గాలను కూడా ఆ రకంగానే అలవోకగా వదిలేస్తున్నావ్.ఏం మనిషివే నువ్వు అని ప్రశ్నించా.

దీంతో ఆయనలో ఇటీవల బీపీ ఎక్కువ కనిపిస్తూ ఉంది.అయ్యా దత్తాపుత్ర ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారు.

"""/" / పవిత్రమైన సాంప్రదాయాన్ని నడిరోడ్డు మీదకు తీసుకురావటం.ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించటము ఘోరమైన తప్పు కాదా అని ప్రశ్నిస్తున్న.

ఇలా ప్రశ్నిస్తే తప్పు అని భావిస్తున్నారు.నిన్ను చూసి అదే తప్పు అందరూ చేస్తే అక్క చెల్లెమ్మల బతుకులు ఏం కావాలి అంటూ పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా అడుగుతుంటే ఆయనకు బీపీ పెరిగిపోయి.చేతులు కాలు అన్ని ఊపేస్తూ.

తెగ ఊగిపోతూ ఉంటాడు అంటూ సెటైర్లు వేశారు.భీమవరంలో జరిగిన బహిరంగ సభకు జనాలు భారీ ఎత్తున రావడం జరిగింది.

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్ర ఈరోజు సాయంత్రం.తూర్పుగోదావరి జిల్లాలో( East Godavari District ) ప్రవేశించనుంది.

ఇడుపులపాయల మొదలైన ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది.

విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్‌.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?