దివంగత నేత వైఎస్ఆర్ కు సీఎం జగన్ నివాళి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు.

ముందుగా నివాళులు అర్పించిన ఆయన అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే వైఎస్ జగన్ తండ్రిని గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.భౌతికంగా తమ మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు.

మీ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమాభిమానలు తనకు కొండంత అండగా నిలిచాయని పేర్కొన్నారు.

మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో తనను చేయిపట్టి నడిపిస్తున్నాయంటూ జగన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ప్రూవ్ చేసుకోవడం పక్కా!