మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.తిరుపతి పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా ఉండగా ఓ అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆయన్ను కలిసేందుకు వచ్చాడు.

2019లో ఓ రోడ్డుప్రమాదంలో అంగవైకల్యం చెందిన మహేష్ అనే వ్యక్తి సీఎం జగన్‌కు తన గోడు వెల్లిబుచ్చడానికి వచ్చాడు.

ఈ మేరకు ఓ అర్జీని సమర్పించాలని మహేష్ భావించాడు.కానీ సెక్యూరిటీ కారణంగా మహేష్ తన అర్జీని సీఎం జగన్‌కు ఇవ్వలేకపోయాడు.

అయితే తిరుపతిలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు ముగించుకుని వెళ్లేదారిలో మహేష్‌ను సీఎం జగన్ గమనించారు.

దీంతో తన కాన్వాయ్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి మహేష్‌ చేతుల్లో ఉన్న అర్జీని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అర్జీలోని అంశాలను పరిశీలించి మహేష్‌కు సాయం చేస్తామని జగన్ తెలిపారు.