జగన్ చేసిన ఒక్క తప్పు ఏంటీ ? ఎలా సరిచేసుకుంటారు ?
TeluguStop.com
వైసీపీ పార్టీ పెట్టిన ఎనిమిదేండ్లకే అధికారం చేజిక్కిచ్చుకుంది.అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి సంచలనమే సృష్టించింది.
ఈ పార్టీ పురుడు పోసుకుని శనివారం నాటికి పుష్కరకాలం పూరైంది.ఇక పార్టీ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అందరూ పాల్గొని సంబురాలు చేశారు.
ఇదంతా బాగానే ఉన్న జగన్ మాత్రం ఒక తప్పు చేయడం గమనార్హం.దీంతో పార్టీ సభ్యుల పట్ల జగన్‌కు ఎలాంటి ఆదరణ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిసింది.
ఏపీ రాష్ట్ర వ్యప్తంగా శనివారం వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌లు కట్ చేసి సంబురాలు చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు తాడేపల్లి సెంట్రల్ కార్యాలయంలో కూడా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.ఇంత జరిగినా జగన్ మాత్రం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనలేదు.
ఇదే హాట్ టాపిక్‌గా మారింది.ఒకవిధంగా చెప్పాలంటే ఇంటా బయటా పార్టీ ఆవిర్భావాలు సవ్యంగానే సాగాయి.
కానీ, జగన్ మాత్రం హాజరు కాకపోవడానికి కారణమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. """/"/
అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందుకు అనేక అడ్డంకులు, సమస్యలు అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అలాంటిది పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారం ఉన్న సీఎం జగన్ ఎందుకు పట్టించుకోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు జగన్‌కు గౌరవమైన స్థానం ఇచ్చినప్పటికీ నేతలను, పార్టీని పట్టించుకోలేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఆవిర్భావ దినోత్సవం నాడు జగన్ ఖాళీగానే ఉన్నారని, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారని తెలిసింది.
అయినా కనీసం అర్ధగంట సేపు పార్టీ కోసం కేటాయించకపోవడం గమనార్హం. """/"/
మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మేలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తోంది.
ఇక జనసేన అధినేత పవన్ కూడా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే అధికారంలో ఉన్న వైసీపీ సీఎం జగన్ మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లైట్‌గా తీసుకోవడం చర్చణీయాంశంగా మారింది.
కీర దోసతో ఆరోగ్యం మెరుగు.. రోజు ఉదయం ఇలా తీసుకుంటే మస్తు లాభాలు!