వైసిపి నియోజకవర్గ ఇంచార్జీల మార్పు ! రెండో లిస్ట్ లో ఉంది వీరేనా ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలో మార్పు వ్యవహారం పెద్ద సంచలనం సృష్టిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ సర్వేలు చేయిస్తున్న జగన్.( CM Jagan ) సర్వే రిపోర్ట్ లో ఆధారంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.

కచ్చితంగా గెలుస్తారు అనుకున్నవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.పనితీరు సక్రమంగా లేనివారు , ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారి లో తనకు అత్యంత సన్నిహితులు ఉన్నా.

పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే 11మంది ఇన్చార్జిలను మార్చారు .

అందులో మంత్రులు కూడా ఉన్నారు .ఇక రెండో జాబితా ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

జగన్ ప్రకటించబోయే రెండో జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. """/" / రెండు జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్( Guada Amarnath ) అనకాపల్లి నుంచి యలమంచిలికి, కొవ్వూరు ఎమ్మెల్యే హోం మంత్రి తానేటి వనిత ను( Taneti Vanitha ) గోపాలపురానికి  మార్చబోతున్నారట.

అలాగే మంత్రి , అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ కు ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ లేదట.

ఆస్థానం లో అమలాపురం ఎంపీ చింత అనురాధకు అవకాశం ఇవ్వనున్నారట.ఇక మంత్రులు జోగి రమేష్ (పెడన ) అంబటి రాంబాబు (సత్తెనపల్లి) ని వేరే నియోజకవర్గం కు పంపబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అలాగే ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం కు( Gummanuru Jayaram ) ఈసారి ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందట .

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత ను ఇన్చార్జిగా , దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను మార్చనున్నారట.

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని లోక్ సభ కు పంపబోతున్నట్లు సమాచారం.

"""/" / అలాగే సీట్ల మార్పు జాబితాలో పాల్గున (అరకు ఎస్టీ ), కన్నబాబు రాజు (యలమంచిలి ), గొల్ల బాబురావు ( పాయకరావుపేట ), పి.

ఉమ శంకర్ గణేష్ ( నర్సీపట్నం ) , పర్వత పూర్ణ చందర్ ప్రసాద్ ( పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట ), తలారి వెంకట్రావు (గోపాలపురం) రక్షణ నిధి (తిరువూరు),   సింహాద్రి రమేష్ బాబు (అవనిగడ్డ ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్ ) లు ఉన్నారు.

వీరితో పాటుగా కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు) వి .వరప్రసాదరావు (గూడూరు), ఆర్డర్ (నందికొట్కూరు), సుధాకర్ ( కోడుమూరు ), వై.

బాలనాగిరెడ్డి ( మంత్రాలయం ) , వై.వెంకటరామిరెడ్డి ( గుంతకల్ ) , తిప్పే స్వామి (మడకశిర ), శ్రీధర్ రెడ్డి ( పుట్టపర్తి ) , కోనేటి ఆదిమూలం ( సత్య వేడు ), శ్రీనివాసులు (చిత్తూరు ), వెంకట గౌడ ( పలమనేరు )  ఈ మార్పు ల జాబితాలో ఉన్నట్టు గా ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వత్థామ.. మామూలు ప్లాన్ కాదుగా!