గోదావరి వరదలపై సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష
TeluguStop.com
అమరావతి: గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం వైయస్.
జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష.
సీఎం జగన్ కామెంట్స్.వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది.సీనియర్ అధికారులు, కలెక్టర్లభుజాలమీద ఈ బాధ్యత ఉంది.
రానున్న 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల సహాయం అందాలి.
అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌తో కూడిన రేషన్ పంపిణీ జరగాలి.
ఈ రేషన్ వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి.మంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి.
కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి.గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు.
ఇద్దరు జాయింట్‌కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు.ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది.ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు.
ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు.ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది.
నాణ్యమైన సేవలు అందించాలి.పంపిణీని ముమ్మరం చేయాలి.
ఇంత వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం.గతంలో ఎప్పుడూ కూడా రూ.
2వేల ఆర్థిక సహాయం చేయలేదు.విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం.
అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ వంటివారు బురదజల్లుతున్నారు.
వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారు.
బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారు.మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు.
ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి.దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
వదంతులను కూడా తిప్పికొట్టాలి.ఎలాంటి సాయానికైనా సిద్ధం.
ఇంకా మీకు ఏమైనా కావాలన్నా.మీకు అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
నిధుల సమస్య లేనే లేదు.మీరు ప్రోయాక్టివ్‌గా మందుకు వెళ్లండి.
"""/"/
ఎలాంటి సమస్య ఉన్నా.పరిష్కరించడానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు.
వచ్చే 48 గంటల్లో వరద బాధిత కటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందాలి.
బాధిత కుటుంబాల ఉట్ల మానవతా దృక్ఫధంతో వ్యవహరించండి.ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది.
బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి.ఎక్కడ అవసరం ఉంటే.
అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించండి.మంచి ఆహారం.
తాగునీరు అందించండి.పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోండి.
బాధితులు శిబిరాలకు వచ్చినా, లేకున్నా.ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ కూడా రూ.
2వేల ఆర్థిక సహాయం, రేషన్ అందాలి.నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి.వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలి.
గర్భవతులైన మహిళలపట్ల ప్రత్యేక శ్రద్ధవహించండి.వారిని ఆస్పత్రులకు తరలించండి.
వైద్యాధికారులు, స్పెషలిస్టులు అందుబాటులో ఉంచేలా చూసుకోండి.వరదల కారణంగా, ముంపు ప్రభావం తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి.
"""/"/
అలాంటివి లేకుండా ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకొండి.ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోండి.
రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి.క్లోరినేషన్ కొనసాగించాలి.
అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి.మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి.
అదనపు సిబ్బంది తరలించాలి.పక్కజిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని సీఎం ఆదేశం.
పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశం.ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు ఆ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశం.
పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టి సారించాలని సీఎం ఆదేశం.మురుగునీటి కాల్వల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి.
నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలపై పరిశీలనచేసి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి.కట్టల బలహీన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ.
గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి.
అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున.అక్కడ పూడిక తొలగించే పనులు చేయాలి.
గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లు పడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలి.పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి.
పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలి.వరద ప్రాంతాల్లో తక్షణ విద్యుత్ పునురుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
వచ్చే 48 గంటల్లో ఈసమస్యను పరిష్కరించాలి.అనేక స్కూళ్లను ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు.
వీటిని తిరిగి అప్పగించేటప్పుడు వాటిని పరిశుభ్రంగా అందించాలి.సమీక్షా సమావేశానికి హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఓట్స్ ఆరోగ్యకరమే.. కానీ వారు తినకపోవడమే బెటర్..!