కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే.

పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోడీ తో భేటీ అయిన జగన్ ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో వరుస భేటీలు కావడం జరిగింది.

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు ఇంకా అనేక విషయాల గురించి ఈ భేటీలో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.

అయితే నిన్నరాత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా.ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయినట్లు దీంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు అమిత్ షాతో.

సీఎం జగన్ భేటీ కావడం జరిగిందట.ఈ భేటీలో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రంలో ఏర్పడ్డ సమస్యలు ఇంకా అనేక విషయాల గురించి జగన్ ప్రత్యేకంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

అమిత్ షా భేటీ అనంతరం.ఢిల్లీ నుండి తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లికి చేరుకోవడం జరిగింది.