దత్త పీఠాధిపతి సచ్చితానంద స్వామిని కలిసిన సీఎం జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పడమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం లోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పీఠాధిపతి సచ్చిదానంద స్వామి తో.భేటీ అయిన జగన్.

స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో సచ్చిదానంద స్వామి అందరూ కరోనా నిబంధనలు సరిగ్గా పాటిస్తే.

ఈ మహమ్మారి అంతమవుతుందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రభుత్వం.

జాగ్రత్తలు తీసుకోవాలని .వంశపారపర్య అర్చక సేవల కొనసాగించాలని సీఎం జగన్ దానికి సానుకూలంగా స్పందించినట్లు సచ్చిదానంద స్వామి తెలిపారు.

అంత మాత్రమే కాక రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

అదే రీతిలో ప్రభుత్వం పై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని.బట్టి జగన్ బాధపడ్డారని తెలిపారు.

అన్ని మతాలను సమానంగా చూడాలని అదే జగన్ అభిమతమని పేర్కొన్నట్లు.సచ్చిదానంద స్వామి స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!