ఈనెల 21న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం
TeluguStop.com
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
ఇందులో భాగంగా ఈనెల 21న పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
సమావేశంలో ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ ఆరా తీయనున్నారు.
అయితే ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల పనితీరుపై ఐ ప్యాక్ కమిటీ జగన్ నివేదిక అందించనుంది.
ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు సీఎం జగన్ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
త్రివిక్రమ్ వివాదం… నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?