CM Jagan : జగన్ ఆ విధంగా చక్రం తిప్పారా ? టీడీపీ తో పొత్తుపై బీజేపీ సైలెన్స్ 

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో( Amit Shah ) భేటీ అయిన టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అనేక రాజకీయ అంశాలపై చర్చించారు.

ఈ చర్చల అనంతరం టిడిపి, బీజేపీలు పొత్తు( TDP BJP Alliance ) పెట్టుకోబోతున్నాయని , ఏపీలో టిడిపి ,బిజెపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయనే ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్లుగానే టిడిపి ,జనసేన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధం చేసుకున్నా .

బీజేపీ తోనూ సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు .

టిడిపి తో పొత్తు విషయంలో నాంచి వేత ధోరణిని అవలంబిస్తోంది. """/" / అసలు పొత్తులపై తమ మనసులో ఏముందో ఇంకా బయట పెట్టడం లేదు.

దీంతో తమతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే ఆలోచనతో ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ టిడిపి, జనసేన నేతల్లో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని నరేంద్ర మోది తో( PM Narendra Modi )  బేటీ కావడంతో జగన్ ఏ విషయంపై చర్చించారనేది ఎవరికి అంతు పట్టడం లేదు.

అయితే జగన్ ప్రధానితో భేటీ తరువాత బిజెపి పెద్దలు టిడపితో పొత్తు విషయంలో పునరాలోచనలో పడ్డారని మాత్రం అర్థం అయ్యింది.

"""/" / కచ్చితంగా మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో,  బిజెపి అండదండలు తమకు తప్పనిసరిగా ఉండాలని జగన్ భావిస్తున్నారని, బిజెపి , టిడిపి ,జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో తాము రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎన్డీఏలో చేరేందుకు తాము సిద్ధమనే సంకేతాలు జగన్ ఇచ్చారని,  అందుకే బిజెపి పెద్దలు దీనిపై నిర్ణయం తీసుకునేందుకే టిడిపి తో పొత్తు అంశం పై స్పందించడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

సినిమా రిలీజ్ అవ్వకముందే కోతలు కోసి బొక్క బోర్లా పడ్డ మేకర్స్ వీళ్లే !