CM Jagan Manifesto : సూపర్ సిక్స్ ని మించి జగన్ మ్యానిఫెస్టో ?

cm jagan manifesto : సూపర్ సిక్స్ ని మించి జగన్ మ్యానిఫెస్టో ?

ఎట్టి పరిస్థితుల్లోనైనా రెండోసారి అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) దానికి అనుగుణంగానే కసరత్తు చేస్తున్నారు.

cm jagan manifesto : సూపర్ సిక్స్ ని మించి జగన్ మ్యానిఫెస్టో ?

వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూనే పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు, వారిని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో భారీ సభలను నిర్వహిస్తున్నారు.

cm jagan manifesto : సూపర్ సిక్స్ ని మించి జగన్ మ్యానిఫెస్టో ?

ఇక వచ్చే ఎన్నికల్లో తమను ఓడించేందుకు టిడిపి, జనసేనలు కూటమిగా వస్తుండడం, రకరకాల పథకాల పేరుతో జనాలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు( Chandrababu ) తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేయడంతో జగన్ కూడా అలెర్ట్ అవుతున్నారు.

టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను( Super Six Manifesto ) మించి ఉండేలా కొత్త మేనిఫెస్టోను రూపొందించే పనిలో ఇప్పటికే ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసారు.

ఈ నెల 18 న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు బహిరంగ సభలో జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు .

ఈ మేనిఫెస్టో అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో దానికి అనుగుణంగానే కసరత్తు చేస్తున్నారు. """/" / ఇప్పటికే టిడిపి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ను విడుదల చేసింది.

దీంట్లోని 6 గ్యారంటీలను ప్రజల ముందు పెట్టారు.మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఇప్పటికే ఈ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మలివిడత మేనిఫెస్టోను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు.

దీంతో వైసిపి( YCP ) ఈనెల 18న తమ మేనిఫెస్టోను రాప్తాడు లో జరిగే సిద్ధం సభలో విడుదల చేయబోతోంది.

గత ఎన్నికల్లో వైసిపి ఇచ్చిన హామీలలో దాదాపు 98% అమలు చేశామని జగన్ పదేపదే చెబుతున్నారు.

మళ్లీ తమను గెలిపిస్తే ఇదేవిధంగా కొత్త మేనిఫెస్టోను కూడా అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని జగన్ చెప్పబోతున్నారు.

"""/" / ఇక కొత్త మేనిఫెస్టోలో వేటికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు అనేది ఇంకా బయటకు రాకపోయినా, రైతులు, ఉద్యోగులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, ఉద్యోగులకు బెనిఫిట్స్ వంటివి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వైసీపీలోని కీలక వర్గాలు చెబుతున్నాయి.

ఇక సామాజిక వర్గాల వారీగాను ఆకట్టుకునే విధంగా కొత్త మేనిఫెస్టో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

సూర్య రెట్రో తో సక్సెస్ సాధిస్తాడా..?

సూర్య రెట్రో తో సక్సెస్ సాధిస్తాడా..?