CM Jagan : “ఆడుదాం ఆంధ్ర” ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) సీరియస్ గా తీసుకోవటం తెలిసిందే.
దీంతో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను ప్రజల మధ్య ఉంచుతూ రకరకాల పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ పరంగా రకరకాల కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది.
ఈ రకంగానే "ఆడుదాం ఆంధ్ర" ( Aaudham Andhra )అనే కార్యక్రమం నిర్వహించారు.
గ్రామస్థాయి నుండి నైపుణ్యాన్ని గుర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు.విద్యార్థులలో యువతలో ఉండే క్రీడా స్ఫూర్తిని వెలికి తీసే విధంగా నిర్వహించారు.
కాగా "ఆడుదాం ఆంధ్ర" ముగింపు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు. """/" /
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు.
రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించామని సీఎం జగన్ చెప్పారు.
క్రికెట్, కబాడీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడాలను గత 47 రోజుల నుంచి గ్రామస్థాయిలో నుంచి ఆటలు నిర్వహించం.
మట్టిలోని మాణిక్యాలకు మంచి శిక్షణ ఇస్తే వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు.వారు అద్భుతాలు సృష్టిస్తారు' అని పేర్కొన్నారు.
'క్రీడాకారులకు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించాం.
21 కోట్ల నగదు బహుమతులు ఇచ్చాం.అని సీఎం జగన్ ప్రసంగించారు.
సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?