ముద్రగడకి కాపు కార్పోరేషన్ పదవి ఆఫర్ చేసిన జగన్? త్వరలో వైసీపీలోకి

ఏపీలో కాపు ఉద్యమనేతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం.

కాపులకి రిజర్వేషన్ కల్పించాలని, బీసీలలో చేర్చాలని గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ చేసిన ఉద్యమం హిసాత్మకంగా మారి, ఓ రైలు దగ్ధం అయిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సమయంలో రైలు తగలుబెట్టడం వెనుక వైసీపీ ఉందని ఆరోపణలు చేసింది.

అదే సమయంలో కాపు వర్గానికి చెందిన వారి మీద ఆ సమయంలో కేసులు పెట్టింది.

ఇక కాపు రిజర్వేషన్ కల్పిస్తా అని మోసం చేసిన చంద్రబాబుకి ఆ వర్గం నుంచి తాజా ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

కాపు వర్గానికి చెందిన ప్రజలు అటు జనసేనకి కూడా అండగా ఉండకుండా నేరుగా జగన్ కి సపోర్ట్ చేసి గోదావరి జిల్లాల్లో భారీ ఆధిక్యత అందించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమకి అండగా నిలబడిన కాపు సామాజిక వర్గాన్నికి తన వంతు సహకారం అందించేందుక ముఖ్యమంత్రి జగన్ సిద్ధం అయ్యారు.

అందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇక వైసీపీలో చేరితే కాపు కార్పోరేషన్ బాద్యతలు ముద్రగడకి అప్పగించి, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయించాలని చూస్తున్నంట్లు తెలుస్తుంది.

ఇక వైసీపీ నుంచి గెలిచిన వారిలో మెజారిటీ కాపులు ఉండటం కూడా ఇప్పుడు కాపు కార్పోరేషన్ కి జగన్ తనవంతుగా తోడ్పాటు అందించడానికి సిద్ధం అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ.. వేసవి తాపాన్ని తీర్చడానికే కాదు దీనితో మరెన్నో లాభాలు!