ఒక్క ఇంటర్వ్యూతో బాబును చిత్తు చేసిన జగన్.. వ్యూస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
TeluguStop.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan )ఒక్క ఇంటర్వ్యూతో ఏపీ పొలిటికల్ లెక్కల్ని మార్చేశారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఈ నెల 8వ తేదీన రాత్రి టీవీ9 ఛానల్ లో జగన్ ఇంటర్వ్యూ ప్రసారం కాగా జగన్ ఇంటర్వ్యూకు వచ్చిన వ్యూస్, రేటింగ్స్ అందరినీ ఒకింత షాక్ కు గురి చేస్తున్నాయి.
జగన్ ఇంటర్వ్యూకు అటూఇటుగానే బాబు ఇంటర్వ్యూ ప్రసారం కాగా ఆ ఇంటర్వ్యూను మాత్రం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
సచిన్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో తుఫాన్ వస్తే సముద్రానికి పోటు ఎలా వస్తుందో అదే విధంగా జగన్ ఇంటర్వ్యూ మరోసారి సంచలనం అయింది.
జగన్ అంటే ఏంటో ఆయనకు క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఈ ఇంటర్వ్యూతో ప్రూవ్ అయింది.
జగన్ ఇంటర్వ్యూ వీడియోకు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.ఎన్నో సందేహాలకు జగన్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో పాటు ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చారు.
ల్యాండ్ టైట్లింగ్ గురించి, కొత్త హామీలను ప్రకటించకపోవడం గురించి, గత ఐదేళ్లలో ఏపీలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి, వైట్ కాలర్ జాబ్స్ గురించి జగన్ ఇచ్చిన సమాధానాలు వావ్ అనేలా ఉన్నాయి.
జగన్ విజన్ చూసి ఆశ్చర్యపోవడం విశ్లేషకుల వంతు అయితే బెంబేలెత్తిపోవడం ఇతర పార్టీల నేతల వంతవుతోంది.
పవన్ పెళ్లిళ్ల గురించి సైతం జగన్ తనదైన శైలిలో పంచ్ పేల్చారు. """/" /
ఒకసారి తప్పు చేస్తే పొరపాటు రెండోసారి తప్పు చేస్తే గ్రహపాటు మూడోసారి నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ జగన్ చెప్పిన మాటలు జనసేన ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి.
జగన్ వీడియోలను కట్ చేసి సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తుండగా జగన్ చేసిన కామెంట్లకు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇదే సమయంలో బాబు ఇంటర్వ్యూలో కొత్తదనం లేకపోవడంతో ఆ ఇంటర్వ్యూ వల్ల బాబుకు నష్టం జరిగిందే తప్ప లాభం చేకూరలేదు.
బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో పస లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. """/" /
ఒకవైపు మోదీ రోడ్ షో జరుగుతున్నా జగన్ ఇంటర్వ్యూపై ఏపీ ప్రజలు ఆసక్తి కనబరిచారంటే జగన్ అంటే ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకం ఉందో సులువుగా అర్థమవుతుంది.
చెప్పిందే చేస్తానని చేసేదే చెబుతానని చెప్పి జగన్ మరోసారి రాష్ట్రంలో అనుకూల ఫలితాలతో సీఎం కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క ఇంటర్వ్యూతో బాబును జగన్ చిత్తు చేశారని వైసీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
మందులతో పని లేకుండా రక్తహీనత దూరం కావాలంటే ఇలా చేయండి!!