హోరాహోరీగా రెండవ రోజు కొనసాగుతున్న సీఎం కప్ -2023

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రోత్సాహంతో జరుగుతున్న సీఎం కప్ -2023 క్రీడలు రెండవ రోజు ఉత్సాహంగా జరుగుతున్నాయి.

మొదటి రోజు ఉమెన్స్ కోకో టీం విన్నర్స్ గా తుంగతుర్తి,రన్నర్స్ గా సూర్యాపేట గెలుపొందాయి.

సీఎం కప్ 2023 పురుషుల కబడ్డీ పోటీలలో మద్దిరాలపై నడిగూడెం,చింతలపాలెంపై మోతె,పాలకవీడుపై మునగాల,పెన్ పహాడ్ పై తుంగతుర్తి,హుజూర్ నగర్ పై మఠంపల్లి, మేళ్ళచెరువుపై కోదాడ, అనంతగిరిపై నూతనకల్, తిరుమలగిరిపై చిలుకూరు జట్లు గెలుపొందాయి.

ఉమెన్స్ కబడ్డీ పోటీల్లో నడిగూడెంపై మేళ్లచెరువు, సూర్యాపేటపై హుజూర్ నగర్,నూతనకల్ పై నేరేడుచర్ల జట్లు విజయం సాధించాయి.

పురుషుల కోకో పోటీలలో నేరేడుచర్లపై చింతలపాలెం , తిరుమలగిరిపై సూర్యాపేట,మద్దిరాలపై చివ్వెంల,జాజిరెడ్డిగూడెం పై నాగారం,చిలుకూరుపై తుంగతుర్తి,మద్దిరాలపై చివ్వెంల జట్లు పై చెయ్యి సాధించాయి.

పురుషుల వాలీబాల్ పోటీలలో మోతె పై సూర్యాపేట, తుంగతుర్తిపై తిరుమలగిరి మఠంపల్లిపై చిలుకూరు గెలుపొందాయి.

మహిళల వాలీబాల్ పోటీలలో ఫైనల్ కు వచ్చిన టీములు గరిడేపల్లి,అనంతగిరి వీరి మధ్య ఫైనల్ పోటీ నిర్వహించాల్సి ఉంది.

జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు వసతి కల్పిస్తూ భోజన సదుపాయం అందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో సురేష్ కుమార్,డివైఎస్ఓ వెంకట్ రెడ్డి బుధవారం సాయంత్రం జరిగే ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బార్లీతో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్‌..!