స్కూల్ చాలా బాగుంది: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్
TeluguStop.com
గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల చాలా బాగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్( Somesh Kumar ) కితాబు నిచ్చారు.
సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ దంపతులు అనంతరం సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల( Geetha Nagar Govt School )ను ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల పూర్వ స్థితి, మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో
మారిన రూపు రేఖలు, సౌకర్యాలు, పెరిగిన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ కు తెలిపారు.
పాఠశాల ప్లే గ్రౌండ్, డైనింగ్ హాల్, క్లాస్ రూం లను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడారు.
అభ్యసన సామర్థ్యాలు పరిశీలించారు.ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలా అంటూ ప్రశ్నించారు.
అన్ని సదుపాయాలు ఉన్నాయని విద్యార్థులు ప్రధాన సలహాదారుకు తెలిపారు.పాఠశాల పునరుద్దరణ( School Rennovation ) కు ముందు 570 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 980 మంది విద్యార్థులు చదువుతున్నారనీ ఉపాధ్యాయులు ప్రధాన సలహాదారుకు తెలిపారు.
స్కూల్ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ స్కూల్ బాగుందంటూ కితాబునిచ్చారు.
సందర్శనలో ప్రధాన సలహాదారు వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,
ఎస్పి అఖిల్ మహాజన్ ,జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్లు ఉన్నారు.
అపెరల్ పార్క్( Apparel Park ) ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్
సిరిసిల్లలోని అపెరల్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ సోమవారం సాయంత్రం సందర్శించారు.
అపెరల్ పార్క్ ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ కు వివరించారు.
అనంతరం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ పార్క్ లోనీ గోకుల్ దాస్ ఇండస్ట్రీ నీ పరిశీలించారు.
ఇండస్ట్రీ నిర్వాహకులు, అందులో పని చేస్తున్న మహిళా కార్మికులతో మాట్లాడారు.ఇండస్ట్రీతో స్ధానికంగానే ఉపాధి లభిస్తుందనీ తద్వారా తమ కుటుంబాలకు అండగా ఉండగలుగుతున్నామని మహిళలు సోమేశ్ కుమార్ కు తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన అపెరల్ పార్క్ తో స్థానికంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందన్నారు.
సందర్శనలో ప్రధాన సలహాదారు వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,
ఎస్పి అఖిల్ మహాజన్ , ప్రాంతీయ ఉప సంచాలకులు అశోక్ లు ఉన్నారు.
సాయి పల్లవి కూతురితో సమానం.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు!