రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన..!!
TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu Naidu ) రేపు అమరావతి రాజధానిలో పర్యటించబోతున్నారు.


ఏపీలో గత వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి ప్రాంతాన్ని పర్యటించబోతున్నారు.


ఉండవల్లి ప్రజా వేదిక నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు.రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు.
2014లో గెలిచిన సమయంలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిలో ఎంపిక చేయడం తెలిసిందే.
ఆ తర్వాత 2019లో వైసీపీ ( YCP )అధికారంలోకి రావటంతో ప్రభుత్వ మార్పుతో మూడు రాజధానులు అంశం పైకి రావడంతో అమరావతి పన్నులు నిలిచిపోయాయి.
"""/" /
అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలవటంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు.అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడం జరిగింది.
దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు మున్సిపల్ మంత్రి నారాయణ( Minister Narayana ), సీఆర్డీఏ అధికారులతో కలిసి చంద్రబాబు పరిశీలించనున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో మొదట పోలవరం పర్యటన చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించబోతున్నారు.
రేపు ఉదయం సీఎం చంద్రబాబు తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు అమరావతి పర్యటనకు బయలుదేరబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలా ఉంటే రాజధాని అమరావతిలో సామాగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు.క్యాబినెట్( Cabinet ) లో చర్చించాక రాజధాని పనులు ప్రారంభిస్తాం.
టెండర్లకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది.కొత్త అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉంది.
రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం పనులపై చర్చించనున్నాం అని పేర్కొన్నారు.
భారీగా పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. 2023తో పోలిస్తే ఎన్ని కోట్లంటే?