నామినేటెడ్ పదవుల భర్తీ లో చంద్రబాబు తాజా నిర్ణయం ఏంటి ?
TeluguStop.com
ఏపీలో నామినేటెడ్ పోస్టుల( Nominated Posts ) భర్తీ విషయంలో కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి( TDP Janasena BJP ) నాయకుల్లో ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలతో పాటు, పార్టీ విజయానికి కష్టపడి పని చేసిన మూడు పార్టీల్లోని నేతలు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు అవకాశం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
రేపో, మాపో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన వెలబడుతుందని ఆశగా ఎదురు చూస్తుండగా, ఈ విషయంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ పదవులను ఎవరికి ఖరారు చేయాలనే విషయంలో చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారు.
ఏపీలో మూడు పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.
"""/" /
ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మూడు పార్టీలు ఒక ఫార్ములా ప్రకారం పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఈ పదవులకి సంబంధించి ముందుగా ఒక జాబితాను సిద్ధం చేశారు. ఈ వారంలోనే ఆ జాబితాను ప్రకటిస్తారని మూడు పార్టీల నాయకులు ఆశగా ఎదురు చూశారు.
అయితే చంద్రబాబు మాత్రం ఈ పదవుల భర్తీ విషయంలో మరో కీలక సూచన చేయడంతో , """/" /
నామినేటెడ్ పదవులను సెప్టెంబర్ లోనే భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో మిత్ర పక్షాల నుంచి వస్తున్న ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో కసురత్తు చేసిన తరువాతనే పదవులను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇప్పటికే రూపొందించిన జాబితా పై మరోసారి కొత్తగా వచ్చిన అభ్యర్థనలతో కలిపి కొత్త జాబుతాను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ఎక్కడా అర్హులకు నష్టం జరగకుండా చూడాలని భావిస్తున్న చంద్రబాబు, పదవుల భర్తీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ.
వచ్చేనెల రెండవ వారంలో ఈ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.
యూట్యూబ్‌లో చూసి పేషెంట్‌కి ఆ పని చేసిన ఆసుపత్రి సహాయక సిబ్బంది(వీడియో)