కలెక్టర్లతో చంద్రబాబు కాన్ఫరెన్స్ .. వీటిపైనే ప్రధాన చర్చ ?
TeluguStop.com
పూర్తిగా పరిపాలనపై ఫోకస్ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు .
గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీసే పనిలో నిమగ్నం అయ్యారు.
ఇక ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఈనెల 5వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్( Collectors Conference ) నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు. """/" /
సచివాలయంలో ఈనెల 5వ తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా( RP Sisodia ) సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి , గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, జి ఏ డి అధికారులు హాజరుకాగా, కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసడియా ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో జిల్లాలో భూములు, మైన్స్ , ఇసుక , సహజ వనరుల దోపిడీ జరిగిందని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు.
ఆ అంశాల పైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా చంద్రబాబు చర్చించనున్నారు. """/" /
అలాగే ఏపీలో శాంతి భద్రతల పై( AP Law And Order ) ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
కలెక్టర్లు , ఎస్పీలతో జిల్లాల్లో శాంతిభద్రతలు, గంజాయి సాగు అమ్మకాలపై కట్టడి వంటి అంశాల పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు.
సీఎంగా బాధ్యతలు నిర్వహించిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వం లో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై విచారణలు చేయిస్తూ .
శాఖల వారీగా శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు.ఈ అంశాలు పైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారట.
కంగువా తో సూర్య సక్సెస్ సాధించాడా..?