రంగంలోకి రాబిన్ శర్మ .. కీలక బాధ్యతలు ఇచ్చిన బాబు

టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) తీసుకునే నిర్ణయాలు ఆషామాషీగా ఉండవు .

ఆయన వ్యూహాలు ఎవరికి అంతుచిక్కని విధంగా ఉంటాయి.టిడిపిని( TDP ) అధికారంలోకి తెచ్చేందుకు జనసేన , బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఎన్నో వ్యూహాలు రచించి అనుకున్న విధంగా పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.

  ఇక వైసిపిని( YCP ) చిత్తుగా ఓడించాలంటే తమ వ్యూహాలతో పాటు , వ్యహకర్తల ఆవశ్యకతను చంద్రబాబు గుర్తించి  రంగంలోకి దింపారు.

రాబిన్ శర్మ( Robin Sharma ) తన టీం తో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు.

ఇక పార్టీ అధికారంలోకి రావడంతో వ్యూహకర్తల అవసరం ఉండదని అంతా భావించారు.అయితే చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ అవసరం ఇంకా ఉందని భావించారు.

"""/" / పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే రాబిన్ శర్మను రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది.

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు,  అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి స్పందన వస్తున్నా,  ఆశించిన స్థాయిలో అయితే మైలేజ్ రావడంలేదనే అభిప్రాయం చంద్రబాబులో ఉంది.

ఈ నేపథ్యంలోనే రాబిన్ శర్మను రంగంలోకి దింపారట .ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షిండే నేతృత్వంలోని శివసేనకు రాబిన్ శర్మ పనిచేశారు.

అక్కడ సక్సెస్ అయ్యాయి.ఇప్పుడు రాబిన్ శర్మ సేవలను ఉపయోగించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

  ప్రభుత్వ పాలనపై రాబిన్ శర్మ సూచనలు చేయబోతున్నారట.  """/" / ప్రభుత్వపరంగా చంద్రబాబు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా,  క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చేరడం లేదని,  ఎమ్మెల్యేలు , మంత్రులు వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నా,  అనుకున్న మేరకు సక్సెస్ కావడంలేదని భావిస్తున్న చంద్రబాబు రాబిన్ శర్మ నేతృత్వంలో సరికొత్తగా ప్రచారం ప్రారంభించే దిశగా సిద్ధం అవుతున్నారు.

ఈ మేరకు సీఎం షేపి లో జరుగుతున్న కార్యక్రమాలు,  ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలపై 50 మంది యువకులకు శిక్షణ ఇవ్వనున్నారట.

  వీరిని త్వరలోనే జిల్లాలకు పంపించి జిల్లాలకు ఇద్దరితో ప్రచారం చేయించబోతున్నట్లు సమాచారం .

దీని ద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత రాకుండా చూడడంతో పాటు,  చంద్రబాబు పాలనను,  నిర్ణయాలను ప్రజలకు వివరించేలా వీరు చేయబోతున్నారట.

  వచ్చే ఎన్నికల వరకు ఇదేవిధంగా రాబిన్ శర్మ నేతృత్వంలోని టీం లు కూటమి ప్రభుత్వం తరఫున పనిచేయబోతున్నాయట.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!