షో తప్ప సాయం ఏది ? జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

ఒకవైపు విజయవాడ నగరంలో వరదలు( Vijayawada Floods ) ముంచెత్తి అక్కడి ప్రజలను వణికిస్తుండగా బాధితులను పరామర్శించేందుకు వస్తున్న నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ,  రాజకీయ వేడిని ఈ వరదల్లోనూ పుట్టిస్తున్నారు.

  తాజాగా వైసిపి అధినేత జగన్ పై( YS Jagan ) టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద ప్రాంతానికి వచ్చి ఐదు నిమిషాలు షో చేసిన జగన్ అక్కడి బాధితులకు ఒక భోజనం ప్యాకెట్ అయినా ఇచ్చారా ? ఒక్కరినైనా పరామర్శించారా అని చంద్రబాబు నిలదీశారు.

  జగన్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని,  అన్నిటికీ అనుమానించే పరిస్థితులు కల్పిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

"""/" / ' బాబాయిని తామే చంపి నారాసూర రక్త చరిత్ర అని రాసినోళ్లు ఏదైనా చేయగలరు.

  వసతి గృహాల్లో ఆహారం కలుషితం అవుతోంది.గతంలో ఎన్నడూ ఇలాంటి వరుస ఘటనలు జరగలేదు.

అత్యంత భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే .గుడవల్లేరు లో ఏదో జరిగినట్లు చెబుతున్నారు.

బుద్ధి జ్ఞానం ఉందా ? మా దృష్టి మళ్లించి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేది వారి ఆలోచనతో ఇలాంటి  కుట్రలు ఎన్నో చేస్తున్నారు' అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం , బాధ్యత అధికార యంత్రంగంపై ఉందని చంద్రబాబు సూచించారు.

  """/" / ప్రకాశం బ్యారేజీ( Prakasham Barrage ) గేట్లకు పడవలు వచ్చి ఢీ కొట్టిన వ్యవహారం పైన విచారణ చేయిస్తామని,  దాని వెనక ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

గేటు వద్ద పరిస్థితి చూస్తే పడవ కొట్టుకొచ్చిన చోట కాంక్రీట్ బ్లాక్ వంగి విరిగిపోయే పరిస్థితికి వచ్చిందని గతంలో ఎప్పుడు ఇలాంటి జరగలేదని చంద్రబాబు అన్నారు.

వరద ప్రాంతాల్లో కొంతమంది అధికారులకు విధులు కేటాయిస్తే సాయం అందించకపోగా,  ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని  వాటి పైన విచారణ చేస్తామని చంద్రబాబు అన్నారు.

టాలీవుడ్ లో మహేష్ బాబు సంచలన రికార్డ్.. బ్రేక్ చేయడం ఏ హీరోకైనా కష్టమేనా?