వాలంటీర్ల కొనసాగింపు పై చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ
TeluguStop.com
గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ( Volunteer System ) ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి వారి ద్వారానే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించే ఏర్పాటును అప్పటి ప్రభుత్వం చేసింది.
దీనిపై అప్పట్లో టిడిపి, జనసేనలు తీవ్రంగానే విమర్శలు చేశాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని, ప్రజల వ్యక్తిగత డేటా వాలంటీర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు చేరుతుందని, ఏపీలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థ ఒక కారణం అంటూ అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో( Chandrababu ) పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విమర్శలు చేశారు.
"""/" /
అయితే ఎన్నికల సమయంలో మాత్రం వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ప్రస్తుతం ఇస్తున్న 5000 గౌరవ వేతనాన్ని 10 వేలకు పెంచుతామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి .
అయితే టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులే అవుతున్నా. వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడం, దీనిని కొనసాగిస్తారా లేక రద్దు చేస్తారా అనేది తెలియకపోవడంతో, ఇప్పటివరకు అంతా ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"""/" /
తాజాగా ఏపీ అసెంబ్లీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు విషయమై చర్చకు వచ్చింది.
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపు పై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైసిపి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు.
దీంతో వైసిపి ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి( Minister Veeranjaneya Swamy ) సమాధానం ఇచ్చారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం పెంచే విషయంపైనే ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి క్లారిటీ ఇచ్చారు .
దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు విషయమై ఒక క్లారిటీ వచ్చింది .అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన ప్రకటనతో దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లకు మేలు జరగనుంది.
వాటే టాలెంట్ గురూ.. రైలులో రద్దీని తట్టుకోలేక అతడు ఏకంగా?