విశాఖ లారస్ ఫార్మా ల్యాబ్స్ ప్రమాదంపై సీఎం ఆరా

విశాఖలోని పరవాడలో లారస్ ఫార్మా ల్యాబ్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు.

అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.

అయితే, లారస్ ఫార్మా ల్యాబ్స్ యాజమాన్యం వైఖరిపై మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం తర్వాత సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడుతున్నారు.ప్రమాదంపై గోప్యత ఎందుకని బాధిత కుటుంబ సభ్యులు నిలదీస్తోన్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

2026 సంవత్సరంలో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. పైచేయి సాధించేది ఎవరో?