Tejaswini : బిగ్ బాస్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్ ద్వారా అమర్ దీప్ కి క్లూ.. సీక్రెట్ చెప్పిన తేజస్విని..!!
TeluguStop.com
బిగ్ బాస్ 7 ( Biggboss7 ) ఈసారి కాస్త రసవత్తరంగానే ఉంది.
బిగ్ బాస్ 6 అట్టర్ ప్లాఫ్ అవడంతో 7 ఉల్టా పల్టాగా ఉంటుంది అని గేమ్ చాలా బాగుంటుంది అని భారీ హైప్ పెంచారు.
అయితే ఇప్పటికే 10 వారాలు ముగిసాయి ఇంకో ఐదు వారాలు మిగిలి ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి వారికి సంబంధించిన రిలేషన్స్ వచ్చారు.
అలా సీరియల్ నటుడు అమర్ దీప్ ( Amar Deep ) కి తన భార్య తేజస్విని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే ఆదే రోజు అమర్ బర్త్డే కావడంతో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీ భార్య రావడం లేదు కేక్ పంపించింది అని చెప్పేసరికి కాస్త హర్ట్ అయ్యారు.
కానీ హౌస్ లోకి వచ్చేసరికి తేజస్విని ఆల్రెడీ వచ్చి ఉంది.అలా తేజస్విని ( Tejaswini ) అమర్దీప్ ని హాగ్ చేసుకుని కాసేపు మాట్లాడుకున్నారు.
అలాగే ఈసారి హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లకు సంబంధించిన రిలేషన్లు చాలా మైండ్ గేమ్ తో వారికి కొన్ని క్లూలు ఇవ్వడమే కాకుండా ఎవర్ని హర్ట్ చేయలేదు.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమర్ దీప్ కోసం వచ్చిన తేజస్విని ఆయనకు ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చింది.
"""/" /
అయితే ఆ ఫోటో ఫ్రేమ్ లో 16 హింట్లు తన భర్తకి ఇచ్చింది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
అయితే తాజాగా ఈ ట్రోలింగ్ కి చెక్ పెట్టింది తేజస్విని.ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అందరూ నేనేదో నా భర్తకి హింట్ ఇచ్చాను క్లూ ఇచ్చాను అని ఏదో మాట్లాడుతున్నారు.
అసలు విషయం తెలియకుండా ఏమీ మాట్లాడకండి అసలు ఈ ఫోటోలో ఏముందో ముందుగా క్లియర్ గా తెలుసుకోండి.
"""/" /
అపార్దాలు చేసుకొని రాద్ధాంతం చేయకండి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారికి ఇచ్చి పడేసింది.
ఇక అమర్దీప్ కి ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ లో 16 హింట్లు ఇచ్చిందని ఆయన చేసిన 16 మిస్టేక్స్ ని ఫోటోల ద్వారా ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.
కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఫోటో ఫ్రేమ్ ని షేర్ చేసి తేజస్విని అసలు సీక్రెట్ బయట పెట్టింది.
వెండి పాత్రలను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!