బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు.దళితబంధు రాలేదని ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు.

సదరు వ్యక్తి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం చేసుకున్నాడని భట్టి పేర్కొన్నారు.ఈ క్రమంలో సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాజ్యాధికారం కోసం ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారని భట్టి ప్రశ్నించారు.దళిత, గిరిజనులు ఎవరూ బలవన్మరణాలు చేసుకోవద్దన్న ఆయన వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడు అందరూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ సర్కార్ మాత్రమే తెలంగాణ ప్రజల కలలు నిజం చేస్తుందని భట్టి వెల్లడించారు.

ఇది విన్నారా? అడల్ట్స్ కోసం డైపర్స్‌.. ఒక్కొక్కటి రూ.6,000 అట.. ఉపయోగం ఏంటంటే!