బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.భారీ వర్షాలపై ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపట్టలేదన్నారు.

వర్షాలతో జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు.కేసీఆర్ వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు సాంకేతికతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ కేసీఆరేనన్న భట్టి కేసీఆర్ రాత్రిపూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యాంలకు ప్లాన్ గీశారని విమర్శించారు.

కేసీఆర్ అనాలోచిత డిజైన్ వలన ప్రజలు మునిగిపోతున్నారన్నారు.పక్క రాష్ట్రాలకు విమానాలు పంపి నాయకులకు కండువాలు కప్పుతారు కానీ సొంత రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే హెలికాప్టర్ ఇవ్వాలని అడిగితే స్పందించరని మండిపడ్డారు.

వర్షాలు వరదల వలన నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025