అమిత్ షా వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి మండిపాటు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమిత్ షా కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని మండిపడ్డారు.లౌకికవాదానికి భిన్నంగా అమిత్ షా మాట్లాడారని భట్టి ఆరోపించారు.

బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చిందన్న ఆయన మీరు రిజర్వేషన్లు కల్పించేదేమిటని నిలదీశారు.

జనగణనను వెంటనే కేంద్రం మొదలు పెట్టాలని చెప్పారు.ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సబ్ ప్లాన్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని భట్టి స్పష్టం చేశారు.

అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?