పెదాల‌ను కోమ‌లంగా మార్చే లవంగ నూనె..ఎలాగంటే?

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు.

అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ తీవ్రంగా వేధించే స‌మ‌స్య పొడి పెదాలు.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, చ‌ల్ల గాలులు కార‌ణంగా పెదాల‌పై తేమ త‌గ్గి పోయి పొడిగా మారిపోతుంటారు.

దీంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే వివిధ ర‌కాల‌ లిప్ బామ్‌ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయినా ఫ‌లితం లేకుండా పెదాల‌పై ఏవేవో ప్ర‌యోగాలు చేస్తారు.అయితే పొడి బారిన పెదాల‌ను తేమ‌గా, కోమ‌లంగా మార్చ‌డంలో ల‌వంగ నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ల‌వంగ నూనెలో ఉండే కొన్ని ప్ర‌త్యేకమైన పోష‌కాలు పెదాల‌కు స‌మ‌ర్థ‌వంతంగా తేమ‌ను అందించి అందంగా మారుస్తాయి.

మ‌రి ఇంత‌కీ ల‌వంగ నూనెను పెదాల‌కు ఎలా వాడాలీ.? అన్న‌ది లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె, కొద్దిగా కోకోవా బ‌ట‌ర్ మ‌రియు కొద్దిగా బీస్‌వ్యాక్స్ వేసుకుని.

డ‌బుల్ బాయిలింగ్ ప‌ద్ధ‌తిలో వేడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఇందులో ఐదారు చుక్క‌లు ల‌వంగ నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని గాలి చొర బ‌డ‌ని డబ్బాలో నింపుకుని ఫిడ్జ్‌లో పెట్టుకుంటే రెండు వారాల దాకా నిల్వ ఉంటుంది.

"""/" / ఇక ఈ మిశ్ర‌మాన్ని ఎలా వాడాలంటే.రాత్రి నిద్రించే ముందు పెదాల‌కు ఉన్న లిప్‌స్టిక్ మొత్తం తొల‌గించి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇప్పుడు త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని పెదాల‌పై కాస్త మందంగా అప్లై చేసి ప‌ది నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

ఆపై కూల్ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజు చేస్తూ పొడి బారిన పెదాలు తేమ‌గా, కోమ‌లంగా మ‌రియు అందంగా మార‌తాయి.

పని చేస్తూనే చనిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి.. షాకింగ్ వీడియో వైరల్..??