ఈ ఏడాది బాగా పాపులర్ అయిన వంటకం ఇదే!

చాలా మంది బేకరీ ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు.అందులో వెరైటీ రుచులతో.

వెరైటీ ఐటమ్స్ ను తయారుచేసి నోరూరిస్తారు‌.ఇప్పటికీ చాలామంది బయటకి వెళ్తే జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ లపై ఆసక్తి చూపుతారు.

అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తూ ప్రేక్షకులకు సోషల్ మీడియా, టీవీల ద్వారా తయారీ విధానం తో సహా చూపిస్తారు.

ఈ ఏడాది కూడా ఒక కొత్త వంటకం రాగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

ఈ ఏడాదిలో క్లౌడ్ బ్రెడ్ అనే ఓ కొత్త వంటకం వచ్చింది.దీనిని తింటే ఆ రుచే వేరు అని తెలుపుతున్నారు.

పైగా ఇది చూడటానికి అచ్చం బ్రెడ్డు లాగే ఉండగా.దీని రుచి మాత్రం మామూలుగా ఉండదు.

మనకి తెలిసినంతవరకు మామూలు బ్రెడ్ లను రుచిచూసాం.అంతేకాకుండా అవి గోధుమ రంగు, తెలుపు రంగుతో కూడి ఉంటుందన్న సంగతి తెలిసిందే.

కానీ ఈ క్లౌడ్ బ్రెడ్ రుచికే కాకుండా.దాని రంగు లో కూడా మార్పు ఉంది.

ఇంతకీ దీనికి క్లౌడ్ అని పేరు ఎందుకు పెట్టారంటే.ఈ బ్రెడ్ కొన్ని రంగుల తో ఉండగా.

అవి చూడటానికి బ్రెడ్ పైన మేఘంలా కనిపిస్తుంది.అందుకే క్లౌడ్ బ్రెడ్ అని పేరు పెట్టారు.

ఈ బ్రెడ్ తయారైన వెంటనే సోషల్ మీడియాలో బాగా వైరల్ వంటకంగా మారింది.

అంతేకాకుండా దీనిని తయారు చేయడానికి ఎన్ని పదార్థాలు అవసరమౌతాయి అని అనుకుంటున్నారా.కేవలం నాలుగు పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు.

కోడుగుడ్డు సోనా, చక్కెర, మొక్కజొన్న పిండి( కార్న్ ఫ్లోర్), ఫుడ్ కలర్.కేవలం వీటితోనే క్లౌడ్ బ్రెడ్ ను సులువుగా తయారుచేసుకోవచ్చని తెలిపారు.

దీని తయారీ విధానం యూట్యూబ్ లో కూడా షేర్ చేశారు.

కాల్వలో పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.. వీడియో వైరల్