మీకు తెలుసా : రెండు లక్షల పెట్టుబడితో వేస్ట్‌ క్లాత్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ పెట్టి లక్షలు సంపాదించొచ్చు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం కంటే స్వయం ఉపాదిని వెదుక్కోవడం మంచిది.ఒకరి కింద పని చేయకుండా కష్టపడి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు.

చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎంతో మంది జీవనోపాది పొందుతున్నారు.కొద్దిపాటి పెట్టుబడితో పలు వ్యాపారాలు చేసుకోవచ్చు.

ఎంతో మంది కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు.ప్రస్తుతం కొత్త తరహా బిజినెస్‌ ఒకటి బాగా ఫేమస్‌ అవుతోంది.

ప్రతి ఇంట్లో కూడా వాడని బట్టలు ఉంటాయి.పాత బట్టలను రీ సైక్లింగ్‌ చేసే బిజినెస్‌ ప్రస్తుతం బాగా లాభాలను తెచ్చి పెడుతుంది.

దీని కోసం కేవలం రెండు లక్షలతో రెండు మెషీన్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇద్దరు పని వారు దీనిని చేయవచ్చు.మొదటి మిషన్‌లో పాత బట్టలను బాగా క్లీన్‌ చేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తుంది.

ఆ మెషన్‌లో నుండి వాటిని తీసి ఒకటి లేదా రెండు రోజులు వాడి ఆ తర్వాత వాటిని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.

"""/"/ వేస్ట్‌ క్లాత్‌లతో డోర్‌ మ్యాట్స్‌, కార్పెట్ల తయారీకి ఉపయోగిస్తారు.అత్యధికంగా పెద్ద పెద్ద కంపెనీలు మెషీన్స్‌ను క్లీన్‌ చేసేందుకు క్వింటాళ్లకు క్వింటాల్ల చొప్పున వేస్ట్‌ క్లాత్‌ పీస్‌లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

అలాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం లేదంటే డిజైనర్‌ డోర్‌ మ్యాట్స్‌ లేదంటే కార్పెట్లను తయారు చేయడం వల్ల కూడా మంచి లాభాలను పొందవచ్చు.

పాత బట్టలను 50 నుండి 100 రూపాయలకు కేజీ కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో క్లీనింగ్‌ క్లాత్స్‌గా తయారు చేయవచ్చు.

ఉత్తర భారతంలో పలువురు యువకులు ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్నారు.వారి అనుభవంను బట్టి నెలకు 40 నుండి 60 వేల వరకు వస్తుందట.

భవిష్యత్తులో మరింతగా మంచి లాభాలు వస్తాయని అంటున్నారు.

రియల్ మీ P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!