మున్సిపాలిటీల బిల్లులన్నీ క్లియర్..: మంత్రి ఆదిమూలపు
TeluguStop.com
ఏపీ రాష్ట్రంలోని మున్సిపాలిటీల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
మొదటి విడతలో భాగంగా 36 మున్సిపాలిటీలకు 516 ఈ-ఆటోలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
రెండో విడతలో మరిన్ని ఈ-ఆటోలను పంపిణీ చేస్తామని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు.గుంటూరు, విశాఖలో వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయన్నారు.
త్వరలోనే రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ -ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.అయితే ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద చెత్త సేకరణకు గానూ సీఎం జగన్ ఈ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?