మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ ప్రతిసారీ ఈ కలర్‌లోకి మారిపోతుందా? అయితే ఇలా క్లీన్ చేయండి!

స్మార్ట్‌ఫోన్‌కి బ్యాక్‌ కవర్‌ను వాడటం ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.మనం నిత్యం వాడే ఫోన్‌కు ఎలాంటి డ్యామేచ్‌ కాకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి.

అయితే ఫోన్‌ కలర్‌ బయటకి కనిపించేందుకు చాలా మంది ట్రాన్స్‌పరేంట్‌ బ్యాక్ కవర్లను వాడుతూ వుంటారు.

అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పౌచ్‌లు వైట్ నుండి యెల్లో కలర్‌లోకి మారిపోతుంటాయి.

దాంతో యూజర్లు ఒకింత అసహనానికి గురవుతూ వుంటారు.ఇంతకీ పౌచ్‌ల రంగు ఎందుకు మారుతుంది? వాటిని ఎలా క్లీన్‌ చేసుకోవాలి? లాంటి విషయాలను ఇపుడు తెలుసుకుందాం.

బేసిగ్గా ఈ ట్రాన్స్‌పరేంట్ కవర్‌లు అనేవి TPU (థర్మో ప్లాస్టిక్‌ పాలీ యురేథిన్‌) మెటీరియల్‌తో తయారు చేయబడి ఉంటాయి.

ఇక కవర్‌ రంగు మారడానికి ప్రధాన కారణం ఒకటి చెప్పుకోవాలంటే.సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు, వేడి అని చెప్పుకోవాలి.

సూర్యుడి నుంచి కిరణాలకు కవర్‌లోని టీపీయూ కెమికల్స్‌ రియాక్షన్‌ అవుతాయి.దీని ఫలితంగా రంగు మారుతుంది.

అలాగే ఫోన్‌ చార్జింగ్ చేసేప్పుడు లేదా ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే వేడి వల్ల కూడా రంగు మారే అవకాశం లేకపోలేదు.

"""/"/ అలాగే ఇక్కడ మరొక ముఖ్య కారణం గురించి తెలుసుకోవాలి.ఫోన్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ కవర్‌ను ఆక్సిడేషన్‌కు గురి చేస్తుంది.

ఈ కారణంగానే ఫోన్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి మారుతుంది.అయితే వాటిని ఇలా క్లీన్‌ చేసుకోవచ్చు.

రంగు మారిన కవర్‌ మళ్లీ వైట్ రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు డ్రాప్స్‌ డిష్‌ వాష్‌ సోప్‌ను వేడి నీటిలో కలపాలి.

ఆ తరువాత ఓ పాత బ్రష్‌ను తీసుకొని ఫోన్‌ కవర్‌పై గట్టిగా రుద్దాలి.

దాని తరువాత నీటితో కడిగితే సరిపోతుంది.మరలా ఆ కవర్ మునిపటిలా తళతళా మెరుస్తుంది.

అలాగే బేకింగ్ సోడాతో కూడా కవర్‌ రంగు మార్చుకోవచ్చు.బేకింగ్ సోడా వేసి కాస్త నీటిని యాడ్‌ చేసి బ్రష్‌తో క్లీన్‌ చేస్తే సరిపోతుంది.

ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా హృతిక్.. ఈ హీరో ఆస్తులు ఎంతంటే?